
Chandrababu: ఆర్థిక అసమానతుల నిర్మూలన కోసం పీ-4 విధానం : చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా తమ పనులు సులభంగా పూర్తయ్యేలా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా అన్ని సేవలను అందించే బాధ్యత తనదేనని తెలిపారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
20 ఏళ్ల క్రితమే ఐటీ రంగం ప్రాధాన్యతను తాను సూచించానని, తన మాట విని ఆ దిశగా ప్రయాణించిన వారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారన్నారు.
Details
జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించాలి
ప్రతి ఒక్కరూ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సాధారణ వ్యక్తులు కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలరని చెప్పారు.
తెలివి, ప్రతిభ కలిగిన భారతీయులు అధికంగా సంపాదించగలరని, అయితే, సమాజం వల్ల ఎదిగిన వారు తిరిగి సమాజానికి చేయూత అందించాలన్నారు.
'జీరో పావర్టీ' లక్ష్యాన్ని సాధించగలిగితే తన జన్మ సార్థకమవుతుందని, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పీ-4 విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు.