
India Pakistan War: పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శుక్రవారం నాడు పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడికి ప్రతిగా, భారత్ పాకిస్తాన్‌లోని ప్రధాన ఎయిర్ బేస్‌లపై ఎదురుదాడులకు దిగింది.
ఈ దాడిలో పాక్ సైనికుల ప్రధాన కేంద్రంగా ఉన్న రావల్పిండిని లక్ష్యంగా తీసుకుంది.
రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఇతర ముఖ్యమైన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
శనివారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు పాకిస్తాన్ అంతటా విస్తరించాయి.
లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్ కోట్, నర్వాల్ వంటి ప్రధాన నగరాలు గగనతల దాడులతో కంపించాయి.
దాదాపు ప్రతి పెద్ద నగరంలో కూడా పేలుళ్లు, వాయు దాడులు చోటుచేసుకున్నాయి.
వివరాలు
పాకిస్తాన్ ప్రయోగించిన మరిన్ని క్షిపణులు
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) వెంబడి తీవ్ర కాల్పులకు తెగబడ్డింది.
ఈ దాడులకు భారత దళాలు తక్షణమే సమాధానం ఇచ్చాయి. పాకిస్తాన్ ప్రయోగించిన 'ఫతే-1' క్షిపణిని భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది.
ఉత్తర భారతదేశంలోని ఒక కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రయోగించిన ఈ క్షిపణిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నిర్వీర్యం చేసింది.
ఇంతే కాదు, పాకిస్తాన్ ప్రయోగించిన మరిన్ని క్షిపణులు ఉదంపూర్, పఠాన్ కోట్, జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించాయి.
అయితే, భారత రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ కూడా సమర్ధవంతంగా తిప్పికొట్టి నాశనం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్..
India shoots down Pak ballistic missile.
— IndiaToday (@IndiaToday) May 10, 2025
Pak FATAH-1 missile shot down in Western Sector.
India Today's @ashraf_wani with more details.#news #OperationSindoor #IndiaStrikesTerroristan #India #ITVideo @PoojaShali pic.twitter.com/oHOvof7N0m