
Pallavi Prashanth: విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు.. మరో ముగ్గురి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన అవినాష్ రెడ్డితో పాటు యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్, పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆ ముగ్గురిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో రెండు కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని గుర్తించి.. పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టులు మరింత పెరిగే అవకాశం ఉంది.
బిగ్ బాస్
షరతులతో పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు
బిగ్‌బాస్-7 టైటిల్‌ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
బిగ్‌బాస్ ఫైనల్స్ ముగిశాక.. అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు.
బస్సులు, కార్లను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు రాజు అరెస్ట్ అయ్యారు.
రెండ్రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.
పల్లవి ప్రశాంత్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతంకం చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఇదే కేసులో అరెస్టు అయిన మరో 12 మంది కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.