NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు
    స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు

    Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 23, 2025
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గాంధేయవాది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్నేహపురి కాలనీలో స్వగృహంలో కన్నుమూశారు.

    పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె ఆమె. జీవితాంతం గాంధేయవాదిగా ఉండి, గాంధీజీ ప్రవచించిన విలువలతో జీవించారు.

    పలు విద్యాసంస్థలకు నిధులు అందించి, దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు విరాళాలు సమకూర్చారు.

    Details

    కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు

    అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. 2022 జులైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను సత్కరించారు.

    పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. 1932 జూన్‌లో భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసిన ఘటనలో పాల్గొన్న కృష్ణమూర్తి దంపతులను బ్రిటిష్ ప్రభుత్వం కఠినంగా శిక్షించింది.

    ఆ సమయంలో అంజలక్ష్మి ఆరు నెలల గర్భిణి అయినా, బ్రిటిష్ ప్రభుత్వం కనికరించలేదు. జైలులోనే కృష్ణభారతి జన్మించారు.

    కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడిని, స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తు చేస్తూ తల్లిదండ్రులు ఆమెకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఆమె తొలి 10 నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది.

    Details

    వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అనుభవం

    పడమర విప్పర్రు గ్రామంలోని తమ మొత్తం ఆస్తిని స్వాతంత్య్ర పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు.

    పశ్చిమ గోదావరిలో గాంధీజీ పర్యటన సందర్భంగా కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

    జీవితాంతం కుష్టు రోగులు, అభాగ్యుల సేవలో నిలిచిన కృష్ణభారతి చివరి వరకు గాంధేయ విలువలతో జీవించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    నరేంద్ర మోదీ

    తాజా

    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా
    Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు తెలంగాణ

    హైదరాబాద్

    E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు తెలంగాణ
    Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు ఇండియా
    Cyber Crime: జాగ్రత్త.. పర్యాటకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు! పర్యాటకం
    Hyderabad : నార్సింగి గుట్టపై జంట హత్యలు.. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు హత్య

    నరేంద్ర మోదీ

    Narendra Modi: భారత్-ఫ్రాన్స్ భారీ రక్షణ ఒప్పందం.. 26 రాఫెల్-ఎం ఫైటర్లు, 3 స్కార్పీన్‌ సబ్‌మెరిన్ల కొనుగోలు ఫ్రాన్స్
    PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ  ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
    Threat Call: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..  ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్‌   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025