Loading...
West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు, ముగ్గురు మృతి
ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు

West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు, ముగ్గురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలో నిమ్‌తీతా-కటవా ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. తెరిచి ఉన్న రైల్వే క్రాసింగ్‌ను వ్యాన్ దాటుతుండగానే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రమాదం తీవ్రతకు వ్యాన్ పూర్తిగా ధ్వంసమై, పట్టాలపై నుజ్జునుజ్జుగా మారింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్కూల్ వ్యాన్‌పై దూసుకొచ్చిన రైలు

ADVERTISEMENT