LOADING...
Sleeper Buses: ప్రయాణికుల ప్రాణాలే ప్రాధాన్యం.. స్లీపర్‌ బస్సుల నిషేధానికి డిమాండ్
ప్రయాణికుల ప్రాణాలే ప్రాధాన్యం.. స్లీపర్‌ బస్సుల నిషేధానికి డిమాండ్

Sleeper Buses: ప్రయాణికుల ప్రాణాలే ప్రాధాన్యం.. స్లీపర్‌ బస్సుల నిషేధానికి డిమాండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2026
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికుల భద్రత దృష్ట్యా చైనా, జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్లో స్లీపర్‌ బస్సులను ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. అయితే మన దేశంలో ట్రావెల్స్‌ బస్సులకు పలు నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిలో 80 శాతానికి పైగా బస్సులు వాటిని పట్టించుకోవడం లేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్లీపర్‌ బస్సులను పూర్తిగా నిషేధించాలని ఆస్కీ సూచించింది. 22 నెలల్లో దేశంలో స్లీపర్‌ బస్సులు పూర్తిగా రోడ్లపై లేకుండా చర్యలు తీసుకోవాలని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు, ముఖ్యంగా స్లీపర్‌ బస్సులు అగ్నికి ఆహుతై ప్రయాణికులు సజీవదహనం అవుతున్న ఘటనల నేపథ్యంలో, బస్‌ బాడీల తయారీ, సాంకేతిక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై రవాణాశాఖ ఆస్కీతో సమగ్ర అధ్యయనం చేయించింది.

వివరాలు

ఒక్క ప్రమాదంతో మేల్కొన్న చైనా

ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఇందులోని సూచనలను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరనుంది. 2012 మార్చిలో యానాంలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత చైనా కఠిన నిర్ణయం తీసుకుంది. డబుల్‌డెక్కర్‌ స్లీపర్‌ బస్సు మిథనాల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో బస్సు దగ్ధమై, అందులో ఉన్న 39 మంది ప్రయాణికుల్లో 36 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అనంతరం ఆ దేశంలో డబుల్‌డెక్కర్‌ స్లీపర్‌ బస్సుల తయారీపై నిషేధం విధించారు. అదేవిధంగా రాత్రి 2గంటల నుంచి ఉదయం 5గంటల వరకు బస్సుల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఇక జర్మనీలో 2006 నుంచే ఈ బస్సులను నిషేధించగా, స్వీడన్, డెన్మార్క్‌లో కఠిన నిబంధనల కారణంగా ఈ బస్సులు అమల్లో లేవు.

వివరాలు

మన దగ్గరా కఠిన నిబంధనలే

మన దేశంలో స్లీపర్‌, సీటర్‌ బస్సులపై అమలు చేయాల్సిన నిబంధనలను Automotive Industry Standards (ఏఐఎస్‌) స్పష్టంగా పేర్కొంది. స్లీపర్‌ బస్సుల్లో కనీసం నాలుగు అత్యవసర ద్వారాలు తప్పనిసరి ప్రయాణికులు నడిచే మార్గం 40-60 సెం.మీ. ఉండాలి * బెర్త్‌ పొడవు 1,800 మి.మీ., వెడల్పు 600 మి.మీ.గా ఉండాలి అత్యవసర ద్వారాలు, మధ్యలో సరిపడ మార్గం ఉండేలా నిర్మాణం చేయాలి అగ్ని ప్రమాదాలను గుర్తించి నియంత్రించే పరికరాలు, జీపీఎస్‌, సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరి

Advertisement

వివరాలు

డ్రైవర్‌ క్యాబిన్‌ డోర్‌ తొలగించాలి

గత ఏడాది అక్టోబరులో కర్నూల్‌లో జరిగిన స్లీపర్‌ బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ పలు సూచనలు చేసింది. డ్రైవర్‌ క్యాబిన్‌ను ప్రయాణికుల భాగం నుంచి వేరు చేసే తలుపును తొలగించాలి ప్రతి బస్సులో కనీసం 10 కేజీల అగ్నిమాపక పరికరాలు ఉండాలి రిజిస్ట్రేషన్‌ సమయంలో అత్యవసర ద్వారాలు, ప్రధాన ద్వారం, లేఅవుట్‌ డ్రాయింగ్‌ తప్పనిసరిగా సమర్పించాలి

Advertisement

వివరాలు

కీలక సూచనలు ఇవే

స్లీపర్‌ బస్సుల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలలోపు నోటిఫికేషన్‌ జారీ చేయాలి తయారీ సంస్థలతో చర్చలు జరపాలి రెండో నెలలో కొత్త స్లీపర్‌ బస్సుల తయారీ పూర్తిగా నిలిపివేయాలి నాలుగు నుంచి 18 నెలల మధ్య స్లీపర్‌ బస్సులను సీటర్‌ బస్సులుగా మార్చాలి మూడో నెల నుంచే మార్పు ప్రక్రియకు గడువు విధించాలి నాలుగు నుంచి 22 నెలల వరకు పొరుగు రాష్ట్రాలతో కలిసి అన్ని బస్సులకు ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలి 22వ నెల నుంచి స్లీపర్‌ బస్సులు పూర్తిగా రోడ్లపై లేకుండా చూడాలి మొత్తానికి ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్లీపర్‌ బస్సులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Advertisement