Page Loader
Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..
తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..

Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఉన్న "లాబొరేటరీ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండేంజర్డ్‌ స్పీసీస్‌" (లాకోన్స్‌) కు చెందిన శాస్త్రవేత్తలు అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేశారు. వారు క్షీరద జంతువుల వెంట్రుకల నుంచి డీఎన్‌ఏను సంగ్రహించి పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రయోగానికి తాజాగా పేటెంట్‌ లభించినట్లు,ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్‌ కార్తికేయన్‌ వాసుదేవన్‌ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ తెలిపారు. కశ్మీర్‌కు చెందిన వ్యాపారులు, నేత కళాకారుల అభ్యర్థనల మేరకు, ఈ శాస్త్రవేత్తల బృందం 'శాటూష్', 'పష్మినా' ఉన్నిని గుర్తించగల డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది గ్లోబల్‌గా తొలిసారి అభివృద్ధి చేయబడిన వినూత్న సాంకేతికతగా పేర్కొనవచ్చు.

వివరాలు 

శాటూష్‌ను అక్రమంగా తరలించి,దానిని కశ్మీర్‌ పష్మినాతో కలిపి తయారీ

శతాబ్దాలుగా కశ్మీర్‌లోని గొర్రెల నుంచి వచ్చే పష్మినా ఉన్నిని ఉపయోగించి శాలువాలు తయారు చేసే సంప్రదాయం ఉంది. అదే సమయంలో,టిబెట్‌ ప్రాంతాల్లో శరవేగంగా అంతరించిపోతున్న జింకల నుంచి సేకరించే మృదువైన వెంట్రుకలతో 'శాటూష్' శాలువాలను తయారు చేస్తున్నారు. అయితే,ఈ జింకలు లుప్తప్రాయ జాతికి చెందినవిగా పరిగణించబడుతున్నందున,శాటూష్‌పై నిషేధం విధించబడింది. అయితే, కొన్ని అక్రమ దళాలు ఈ నిషేధాన్ని దుర్వినియోగం చేస్తూ శాటూష్‌ను 'పష్మినా'పేరిట అమ్ముతున్నట్లు గుర్తించారు. టిబెట్‌ నుంచి కశ్మీర్‌,లద్దాఖ్‌ ప్రాంతాలకు ముడి శాటూష్‌ను అక్రమంగా తరలించి,దానిని కశ్మీర్‌ పష్మినాతో కలిపి తయారీ చేస్తున్నారు. శాటూష్‌,అసలైన పష్మినాను వేరుగా గుర్తించడం అత్యంత క్లిష్టమైన పని కావడంతో,విమానాశ్రయాలు, షిప్పింగ్‌ కేంద్రాల్లో ఈ ఉత్పత్తుల రవాణా నిలిపివేయబడుతోంది. ఈ కారణంగా పష్మినా ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి.

వివరాలు 

 భారత్‌లో ఈ టెక్నాలజీకి అధికారికంగా పేటెంట్‌ 

ఈ నేపథ్యంలో వాసుదేవన్‌ బృందం రంగంలోకి దిగింది. ఒక సంవత్సర కాలం పాటు వారు తీవ్రంగా పరిశోధనలు జరిపి, టిబెటన్‌ జింకల ప్రత్యేకమైన మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ ప్రైమర్‌ను గుర్తించగలిగారు. దీని ఆధారంగా నిర్వహించే డీఎన్‌ఏ పరీక్ష ద్వారా శాటూష్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చని వారు నిర్ధారించారు. ఈ డీఎన్‌ఏ ఆధారిత గుర్తింపు సాంకేతికతకు భారత్‌తో పాటు కెనడా, అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో, భారత్‌లో ఈ టెక్నాలజీకి అధికారికంగా పేటెంట్‌ మంజూరైనట్టు తెలిపారు.