Loading...
PM Modi: పవన్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. మోదీ, చంద్రబాబు, లోకేశ్‌ పోస్టులు
పవన్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. మోదీ, చంద్రబాబు, లోకేశ్‌ పోస్టులు

PM Modi: పవన్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. మోదీ, చంద్రబాబు, లోకేశ్‌ పోస్టులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌ ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న నాయకుడని పేర్కొంటూ ఎక్స్‌ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ముందుండి నడిపించడంలో పవన్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రజాసేవలో ఆయన ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మోదీ శుభాకాంక్షలపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తనపై ప్రధాని చూపుతున్న అభిమానం, అందిస్తున్న ప్రోత్సాహం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేయాలనే స్ఫూర్తిని అవి కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

'వికసిత్‌ భారత్‌' నిర్మాణం కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి: పవన్ 

140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా 'వికసిత్‌ భారత్‌' నిర్మాణం కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని పవన్‌ అన్నారు.

ఆయన నాయకత్వం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. మోదీ మార్గదర్శకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్‌ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

వివరాలు 

పవన్‌ నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలు: చంద్రబాబు

పవన్‌ కల్యాణ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని అమలు చేస్తున్న తీరు మంచి ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు.

ఆయన చర్యలు రాష్ట్రంలో మార్పునకు బాటలు వేస్తున్నాయని అన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణంపై కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో పవన్‌ కల్యాణ్‌ నిరంతరం పనిచేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజల కోసం మరింత కాలం ఇదే విధంగా సేవ చేస్తూ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

వివరాలు 

'నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్‌': లోకేశ్

మంత్రి నారా లోకేశ్‌ కూడా పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు పవన్‌ 'దేవుడిచ్చిన అన్నయ్య' అని పేర్కొన్నారు.

సినీ అభిమానులకు ఆయన పవర్‌స్టార్‌, జనసైనికులకు సేనాని, తనకు మాత్రం పవనన్న అని లోకేశ్‌ అభివర్ణించారు.

పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తలపించేలా పవన్‌ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులను లోకేశ్‌ అభినందించారు.

ADVERTISEMENT