Page Loader
Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం
Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం

Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 28, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెగాసస్‌ దుమారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హ్యాకింగ్‌ వివాదం మరో మలుపు తీసుకుంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు ప్రముఖ అంతర్జాతీయ ఎన్‌జీఓ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.దీంతో మళ్లీ పెగాసస్‌ వివాదం చెలరేగుతోంది. అక్టోబర్‌లో ఆపిల్‌ నుంచి హ్యాక్‌ అలెర్ట్‌లు వచ్చాక ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గురువారం వెల్లడించింది. 'ది వైర్‌' పత్రిక ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజన్‌ సహా మరో జర్నలిస్టు ఫోన్'ను పరీక్షించగా వాటిల్లో పెగసస్‌ ఉన్నట్లు తేల్చిందని వివరించింది. ప్రభుత్వ మద్దతుతో జరిగే హ్యాకింగ్‌కు వీరి ఫోన్లు టార్గెట్ అయ్యాయని ఆపిల్‌ నుంచి అక్టోబర్‌లో సందేశాలు వచ్చాయి.

details

ప్రతిపక్షాలకు,జర్నలిస్టులకు హ్యాకింగ్ అలెర్టులు

తమ ప్రజల మానహక్కులను రక్షించడం, చట్టవిరుద్ధ నిఘా నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఆపిల్‌ నుంచి పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు హ్యాకింగ్‌ అలెర్ట్‌లు సైతం వచ్చాయి. 150 దేశాలకు సందేశాలు వెళ్లాయని యాపిల్ వివరించింది. అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్ట్ మాత్రం ప్రభుత్వమే ఆపిల్‌పై ఒత్తిడి తెచ్చి ఇటువంటి ప్రకటన చేయించిందని కథనం ప్రచురించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసింది.ఈ సాంకేతికతను ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది.భారత ఇంటెలిజెన్స్‌ 2017లో ఎన్‌ఎస్‌ఓ నుంచి పరికరాలను కొనుగోలు చేసింది. రాహుల్‌ గాంధీతో పాటు రాజకీయ నేతలు,న్యాయమూర్తులు ఇలా 300 మంది ఫోన్లు పెగాసస్‌తో హ్యాక్‌ చేసినట్లు అప్పట్లో 'ది వైర్‌' కథనం పార్లమెంట్‌ను కుదిపేసింది.