NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే
    తదుపరి వార్తా కథనం
    Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే
    Inter Exams : ఫిబ్రవరి28 నుంచి ఇంటర్‌ పరీక్షలు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే

    Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 28, 2023
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

    జనవరిలో ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్స్, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్‌ జరిపించనున్నారు. ఇంటర్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ఇంటర్మీడియట్‌ బోర్డు త్వరలోనే విడుదల చేయనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

    ఒకరోజు ఫస్టియర్‌ వారికి, మరో రోజు సెకండియర్‌ వారికి పరీక్షలను నిర్వహించనున్నారు.

    details

    మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు

    2024 కొత్త ఏడాదిలో తొలిసారి మొదటి సంవత్సరపు విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.

    ఈ క్రమంలోనే ఇంగ్లిష్‌ పేపర్‌ను 80 మార్కులకే కుదించారు. వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్‌, ఇంటర్నల్స్‌తో కూడిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.

    మార్చి 18 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు :

    పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు మార్చి 18 నుంచి నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

    మొత్తం ఏడు రోజుల పాటు పరీక్షలను నిర్వహించనుండగా, మార్చి నాలుగు వారంలో పరీక్షలు ముగియనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తెలంగాణ

    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్  విజయశాంతి
    CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్  రేవంత్ రెడ్డి
    Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు నిర్మల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025