ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ ప్రత్యక్షం : గులాబీ రంగుకు స్ట్రాబెరీ మూన్ కి సంబంధం ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆదివారం సాయంత్రం ఆకాశంలో చంద్రుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా కనిపించే పరిమాణం కంటే మరింత పెద్దగా చంద్రుడు కనిపించాడు. అది కూడా పింక్ కలర్ లో కనిపించడం మరో విశేషం.
అయితే జూన్ నెలలో చంద్రుడు పెద్దగా కనిపించడాన్ని స్ట్రాబెర్రీ మూన్ అని అంటారు. స్ట్రాబెరీ మూన్ ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తూ వైరల్ చేశారు నెటిజెన్లు.
అసలు దీన్ని స్ట్రాబెర్రీ మూన్ అని ఎందుకంటారు?
చంద్రుడు పింక్ కలర్ లో కనిపించాడు కాబట్టి దీన్ని స్ట్రాబెర్రీ మూన్ అంటారని అనుకుంటే పొరపాటు అవుతుంది. జూన్ నెలలో వచ్చే పౌర్ణమికి అమెరికాలోని గిరిజన తెగలు స్ట్రాబెరీ మూన్ అని పేరు పెట్టారు.
Details
యూరప్ లో రోజ్ మూన్
అమెరికాలో అక్కడ స్ట్రాబెరీల పంట కాలంలో వచ్చే పౌర్ణమి ఇదే. స్ట్రాబెర్రీల పంట కాలాన్ని ఈ పౌర్ణమి సూచిస్తుందన్న మాట.
స్ట్రాబెర్రీ మూన్ ని యూరప్ లో రోజ్ మూన్ అని కూడా అంటారు. గులాబీల పెంపకాన్ని సూచించే పౌర్ణమి అని వాళ్ళు భావిస్తారు.
అసలు చంద్రుడు ఎందుకు సాధారణంగా కంటే పెద్దగా కనిపించాడు?
చంద్రుడు భూమికి ఉపగ్రహం. అంటే భూమి చుట్టూ తిరుగుతాడు. అలా కక్ష్యలో తిరుగుతుండగా ఒక్కొక్కసారి భూమికి దగ్గరగా వస్తాడు.
ఆ సమయంలో చంద్రుడి పరిమాణం సాధారణంగా కంటే 14% పెద్దగా కనిపిస్తుంది. ఆదివారం రోజు సాయంత్రం కనిపించిన చంద్రుడి రూపం అందుకే పెద్దగా కనిపించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న స్ట్రాబెర్రీ మూన్ ట్వీట్
The full Strawberry Moon rising at Stonehenge this morning 😍🍓🌕🌙✨ photo credit 📷 Stonehenge Dronescapes on FB #strawberry #strawberrymoon #fullmoon #moon #stonehenge pic.twitter.com/O9MVXGDSUB
— Stonehenge U.K (@ST0NEHENGE) June 4, 2023