
India on the moon: చంద్రయాన్-3 విజయవంతం అభివృద్ధికి చెందిన భారతానికి నాంది: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలతో పాటు, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సుకు వెళ్లిన మోదీ.. అక్కడి నుంచి వర్చవల్‌గా చంద్రయాన్-3 ల్యాండిగ్ ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ఈ చారిత్రక సందర్భాన్ని అభివృద్ధి చెందిన భారతదేశానికి నాందిగా మోదీ అభివర్ణించారు.
భారతదేశం ఇప్పుడు చంద్రునిపై ఉందని ఉద్విగ్న ప్రసంగం చేశారు. ఈ ఘనత సాధించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు.
మోదీ
దక్షిణాఫ్రికాలో ఉన్నా నా మనసు చంద్రయాన్ మిషన్‌తోనే: మోదీ
చంద్రుని ఉపరితలం దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ప్రయోగం చంద్రునిపై దృక్పథాన్ని మారుస్తుందన్నారు.
తాను దక్షిణాఫ్రికాలో ఉండవచ్చు కానీ తన మనసు ఎల్లప్పుడూ చంద్రయాన్ మిషన్‌తో ఉంటుందని చెప్పారు.
అనంతరం ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ మోదీ ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రయాన్ మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో ఈ ఫీట్ సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది. ఇప్పుటి వరకు చైనా, అమెరికా, రష్యా మాత్రమే ఈ ఘనత సాధించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్రో చీఫ్‌కు శుక్షాకాంక్షలు చెప్పుతున్న ప్రధాని మోదీ
#WATCH | Johannesburg, South Africa | Immediately after the success of Chandrayaan-3, PM Narendra Modi telephoned ISRO chief S Somanath and congratulated him. pic.twitter.com/NZWCuxdiXw
— ANI (@ANI) August 23, 2023