NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా
    తదుపరి వార్తా కథనం
    'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా
    మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా

    'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిరసనలతో చట్టసభల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

    ఎలాంటి లక్ష్యం, దిశ లేకుండానే ఆయా పార్టీల సభ్యులు ముందుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను తాను ఇంతవరకు చూడలేదని మోదీ అసహం వ్యక్తం చేశారు.

    ఆయా పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదన్న మోదీ, తమ తీరుతో ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నట్లుగా అభివర్ణించారు.

    విపక్షాల కూటమి పేరులో ఇండియా (INDIA)ఉంటే సరిపోదని, ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేర్లలోనూ ఇండియా ఉందన్నారు.

    DETAILS

    విపక్షాల వల్లే సభలు జరగడం లేదు: మోదీ 

    ఇండియా అనే పదం ద్వారా విపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మోదీ అన్నారు.

    ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ కార్యకలాపాలు ఏ ఒక్కరోజూ సజావుగా సాగలేదని, దీనికి కారణం విపక్షాల తీరేనని మోదీ విరుచుకుపడ్డారు.

    మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అఖండ విజయంపై ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

    మణిపుర్‌ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్‌ లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంటోంది. గందరళగోళ పరిస్థితుల నడుమ సభలు వాయిదాలు పడుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బీజేపీ
    దిల్లీ
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    తాజా

    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్

    నరేంద్ర మోదీ

    డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ  దిల్లీ
    గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు తమిళనాడు
    భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్  ఫ్రాన్స్
    ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు  దిల్లీ

    బీజేపీ

    పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే ఉద్ధవ్ థాకరే
    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్ వైట్‌హౌస్
    ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ నరేంద్ర మోదీ
    గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్ కర్ణాటక

    దిల్లీ

    దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం రాజధాని
    దిల్లీలో కాల్పుల కలకలం.. 12 కేసుల్లో నిందితుడు, కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్   భారతదేశం
    ఎల్జీపై సీఎం కేజ్రీవాల్ గరంగరం.. దిల్లీ గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం  అరవింద్ కేజ్రీవాల్
    భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  రాజ్యసభ
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే మణిపూర్
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు లోక్‌సభ
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025