Page Loader
మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన 
మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన

మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన 

వ్రాసిన వారు Stalin
Jul 25, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ పలువురు విపక్షాల నేతలు వాయిదా నోటీసులు ఇచ్చారు. దీంతో ఉభయ సభలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ స్పందించకపోవడంపై ప్రతిపత్రక కూడమి 'ఇండియా' (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్)కి చెందిన ఎంపీలు సోమవారం రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్షకు దిగారు. 'ఇండియా ఫర్ మణిపూర్' అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు రాత్రంతా నిరసనకు దిగారు.

మోదీ

ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌‌కు సంఘీభావం

పార్లమెంట్‌లో మణిపూర్ హింసపై ప్రధాని మోదీ స్పందించాలని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ డిమాండ్ చేసిన నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల మిగిలిన కాలానికి ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో సంజయ్ సింగ్‌కు సంఘీభావంగా ప్రతిపక్ష ఎంపీలు కూడా నిరసన తెలిపారని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు. పార్లమెంటులో మణిపూర్‌పై చర్చించాలని ప్రధాని మోదీని అడిగినందుకు ఆశ్చర్యకరంగా, అన్యాయంగా సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సంఘీభావంగా తామంతా అక్కడ కూర్చుకున్నామని గోఖలే ట్వీట్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో నిరంతరం ఉభయ సభల కార్యకలాపాలు వాయిదాపడుతూ వస్తున్నాయి.