
PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమ ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు.
నవంబర్ 16 నుండి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించిన మోదీ, ఇప్పుడు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు.
ఈ ఉదయం గయానా నుంచి భారత్‌కు బయలుదేరిన ఆయన, విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు.
మోదీ పర్యటన మొదటి భాగం నైజీరియాలో జరిగింది. నవంబర్ 16-17 తేదీల్లో నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటించారు.
ఇది 17 సంవత్సరాల తరువాత భారత ప్రధాన మంత్రి నైజీరియాలో చేసిన తొలి పర్యటన కావడం ప్రత్యేకం.
వివరాలు
1968 తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి
ఈ పర్యటనలో, మోదీ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునఃసమీక్షించారు.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
నైజీరియాలోని భారతీయులకు ఆయన ప్రసంగం కూడా ఇచ్చారు.
నైజీరియాలో పర్యటించిన తర్వాత, మోదీ బ్రెజిల్ (Brazil)వెళ్లారు. నవంబర్ 18-19 తేదీల్లో రియోడిజనీరో నగరంలో జరిగిన జీ-20 సదస్సులో(G20 Summit)పాల్గొన్నారు.
ఈ సమ్మిట్‌లో ఆయన ప్రపంచ దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
ఆ తరువాత మోదీ గయానా (Guyana)పర్యటనకు వెళ్లారు. 1968 తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.
గయానా అధ్యక్షుడు మొహమ్మద్ అలీతో పాటు ఇతర సీనియర్ నాయకులతో మోదీ చర్చలు జరిపారు.
ఈ పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం లభించింది. గయానా,డొమెనికా దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ప్రధానిని సత్కరించాయి.