PM Modi: సద్గుణాలు ఉన్నవారితోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ మోదీ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది. ప్రపంచంలోని పలు దేశాల అధినేతలు, ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రపంచ సంక్షేమానికి దోహదపడే అంశాలపై సానుకూలమైన, అర్థవంతమైన చర్చలు జరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వివరాలు
సద్గుణాలు ఉన్న వ్యక్తులతోనే మాట్లాడాలి: మోదీ
''రాబోయే రెండు మూడు రోజుల్లో బ్రిక్స్ సదస్సు కోసం ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు నేతలు భారత్‌కు రానున్నారు. ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలపై అర్థవంతమైన చర్చలు సాగుతాయని ఆశిస్తున్నాను. సద్గుణాలు ఉన్న వ్యక్తులతోనే మాట్లాడాలి. వారితో కలిసి పనిచేయాలి. వారితోనే చర్చలు జరపాలి, స్నేహాన్ని కొనసాగించాలి. దుర్గుణాలు కలిగినవారికి దూరంగా ఉండాలి'' అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీ చేసిన ట్వీట్
अगले कुछ दिनों में दुनियाभर के नेता BRICS Summit के लिए जुटेंगे। पूर्ण विश्वास है कि सम्मेलन में विश्व कल्याण की कामना के साथ विभिन्न मुद्दों पर सकारात्मक और सार्थक चर्चा होगी।
— Narendra Modi (@narendramodi) September 11, 2026
सद्भिरेव सहासीत सद्भिः कुर्वीत सङ्गतिम्।
सद्भिर्विवादं मैत्रीं च नासद्भिः किंचिदाचरेत्॥ pic.twitter.com/YG36WlpiYg
వివరాలు
శని, ఆదివారాల్లో బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు
కాగా, శని, ఆదివారాల్లో దిల్లీలో బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భారత్‌కు వస్తున్న పలువురు దేశాల నాయకులతో ప్రధాని మోదీ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు.
ఈ భేటీల్లో ఇరు దేశాలకు సంబంధించిన వివిధ అంశాలతో పాటు పరస్పర సహకారం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.