Page Loader
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన
జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 28, 2023
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు జులై 12న మోదీ రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాజీపేటలో రైల్వే కోచ్‌ పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అయితే గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాని రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పిన పార్టీ వర్గాలు, తాజా షెడ్యూల్ ప్రకారం జులై 12నే రానున్నట్లు స్పష్టం చేశాయి. శంకుస్థాపన అనంతరం వరంగల్‌ గడ్డ మీద ప్రధాని సభ నిర్వహణకు కృషి చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు ప్రకటించారు.

details

 రాష్ట్రానికి 600 మంది బూత్‌ కమిటీ సభ్యులు  

మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు అందుతాయని పార్టీ నేతలు వివరించారు. మరోవైపు హైదరాబాద్‌ మహానగరం వేదికగా జులై 8న 11 రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సదస్సులో తెలంగాణకు సంబంధించి కీలక నిర్ణయాలు జరగొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు భోపాల్ సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బూత్‌ కమిటీ సభ్యులు ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. జులై 5 వరకు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్‌లలో బృందాలుగా విడిపోనున్నారు.