Page Loader
PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ
పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ

PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ

వ్రాసిన వారు Stalin
Sep 18, 2023
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రత్యేక సమావేశాల వ్యవధి తక్కువగానే ఉండొచ్చు కానీ, చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జీవితంలో కొన్ని క్షణాలు ఉత్సాహం, విశ్వాసాన్ని నింపుతాయని, ఈ ప్రత్యేక సమావేశాలు తనకు అలాంటి అనుభూతిని కలిగిస్తాయని మోదీ పేర్కొన్నారు. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు విజయవంతం కావడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారత జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న ప్రధాని మోదీ