వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు. గ్రామ పంచాయతీలు రాబోయే ఐదేళ్ల కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నీటి సరఫరాతో పాటు పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై కూడా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రతి గ్రామ పంచాయతీ కూడా నీటి సరఫరాకు సంబంధించి నెలవారీ లేదా త్రైమాసిక నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ప్రధాని మోదీ సూచించారు. ఇలా చేయడం వల్ల ప్రతి గ్రామంలో కుళాయి నీరు అందుతున్న ఇళ్ల సంఖ్యను స్పష్టం తెలియజేస్తుందన్నారు.
రాబోయే 25 సంవత్సరాల ప్రయాణంలో ఇది కీలక ఘట్టం
ప్రతి గ్రామంలో నీటి నాణ్యతను పరీక్షించే.. వ్యవస్థను ప్రధాని మోదిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వాటర్ విజన్- 2047లో భాగంగా రాబోయే 25 సంవత్సరాల ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అన్నారు. అన్ని ప్రభుత్వాలు, వ్యవస్థలు సమిష్టిగా కలిసినప్పుడే వాటర్ విజన్- 2047 నెరవేరుతుందన్నారు. 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' క్యాంపెయిన్ కింద దేశంలో ఇప్పటి వరకు 70 లక్షల హెక్టార్లకు పైగా భూమిని మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు. నీటి పర్యావరణ వ్యవస్థలో నదులు, ఇతర వనరులు అత్యంత కీలకమన్నారు. ప్రతి ఇంటికి నీటిని అందించాలనే ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు.