Loading...
PM Modi: ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లకు మోదీ.. రేపటి నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటన
ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లకు మోదీ.. రేపటి నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటన

PM Modi: ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లకు మోదీ.. రేపటి నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 1 వరకు నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలతో పాటు బహుపాక్షిక సమావేశాల్లోనూ మోదీ పాల్గొంటారు.

వివరాలు 

ఎస్‌సీవో సదస్సుకు హాజరు.. పుతిన్‌తో భేటీ

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో మోదీ పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలపై నేతలిద్దరూ విస్తృతంగా సమీక్షించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ వెల్లడించారు.

కిర్గిస్థాన్ అధ్యక్షుడు సాదిర్ జాపరోవ్ ఆహ్వానం మేరకు మోదీ ఎస్‌సీవో సమావేశానికి హాజరవుతున్నారు. సదస్సు చివరి రోజు జరిగే ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు.

వివరాలు 

నోమాడ్ గేమ్స్ ప్రారంభ వేడుకల్లోనూ..

ఎస్‌సీవోలోని ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి ఆరో వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా మోదీ హాజరుకానున్నారు.

బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీవో సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితర నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

భారత్ 2017లో ఎస్‌సీవోలో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరింది. ఈ నేపథ్యంలో సంస్థకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం 25వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోనుంది.

తొలుత ఉజ్బెకిస్థాన్‌కు..

కిర్గిస్థాన్ పర్యటనకు ముందు మోదీ ఈ నెల 29, 30 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తారు.

ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆయన తాష్కెంట్‌కు వెళ్లనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

వాణిజ్యం నుంచి విద్య వరకు..

ఉజ్బెకిస్థాన్‌లో మోదీ పర్యటించడం ఇది నాలుగోసారి. తాష్కెంట్‌లో అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో మోదీ ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించనున్నారు.

భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే ఈ చర్చల ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఈ సమావేశాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్యతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలు దృష్టి సారించనున్నారు.

తాష్కెంట్‌లో మోదీ పలు ముఖ్య ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. శాస్త్రి మెమోరియల్‌తో పాటు తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు.

ADVERTISEMENT