Emmanuel Macron India Visit: 'ఫ్రెండ్ మెక్రాన్'కు స్వాగతం… ఎక్స్ వేదికగా మోదీ సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిలో భేటీ కావాలని సూచిస్తూ ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు.
వివరాలు
ముంబయి, ఢిల్లీల్లో మీతో సమావేశం కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను
''భారత్‌కు ఆత్మీయ స్వాగతం. ఈ పర్యటన ద్వారా భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని ఎదురుచూస్తున్నాను. మన మధ్య జరిగే చర్చలు అనేక రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని మరింత బలపరుస్తాయని, ప్రపంచ అభివృద్ధికి తోడ్పడతాయని నమ్మకం ఉంది. ముంబయి, ఢిల్లీల్లో మీతో సమావేశం కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందేశంలో మెక్రాన్‌ను ఆయన స్నేహితుడిగా సంబోధించడం విశేషం. మూడు రోజుల భారత పర్యటనపై మెక్రాన్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Bienvenue en Inde !
— Narendra Modi (@narendramodi) February 17, 2026
L’Inde se félicite de votre visite et entend donner un nouvel élan à notre partenariat stratégique. Je suis convaincu que nos discussions renforceront davantage la coopération dans divers secteurs et contribueront au progrès mondial.
À très bientôt à Mumbai,… https://t.co/5gDTDt6llp