LOADING...
Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..
దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..

Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల ధైర్యం, త్యాగాలను కొనియాడుతూ ఆయన ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా సందేశం విడుదల చేశారు. దేశ భద్రత కోసం కఠిన పరిస్థితుల్లోనూ అచంచల కర్తవ్యనిష్ఠతో సేవలందిస్తున్న భారత సైన్యానికి ఈ సందర్భంగా గౌరవ సెల్యూట్ చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్న సైనికులు భారత గౌరవానికి నిలువెత్తు ప్రతీకలని ఆయన అభివర్ణించారు. వారి అంకితభావం దేశ ప్రజల్లో విశ్వాసం, కృతజ్ఞతను పెంపొందిస్తోందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు మోదీ ట్వీట్‌లో తెలిపారు.

వివరాలు 

జైపూర్‌లో ఘనంగా 78వ ఆర్మీ డే పరేడ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు 

ఇదిలా ఉండగా, 78వ ఆర్మీ డే పరేడ్‌ను రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో రోబో డాగ్స్‌తో పాటు ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణులను ప్రదర్శించనున్నారు. ఈ పరేడ్‌కు సుమారు లక్షన్నర మంది హాజరవుతారని అంచనా. గతంలో ఆర్మీ డే పరేడ్‌ను దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే నిర్వహించేవారు. అయితే 2023 నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ వేడుకలను నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

Advertisement