Polavaram: పోలవరం అథారిటీ 18వ సమావేశం నేడు.. 12 కీలక అంశాలపై చర్చకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. అథారిటీ సీఈవో సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలను చర్చించనున్నారు. 2026-27లో ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటివరకు పనులు సాధించిన పురోగతిపై ప్రధానంగా సమీక్ష చేపట్టనున్నారు. అదే సమయంలో పోలవరం అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదరాల్సిన ఎంవోయూపైనా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, పోలవరం అథారిటీ సీఈ రమేష్ బాబు, పోలవరం ఎస్‌ఈ రామచంద్రరావుతో పాటు ఇతర అధికారులు హాజరుకానున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పోలవరం అథారిటీ చేసిన వ్యయాలను కూడా సమావేశంలో ఆమోదించనున్నారు.
వివరాలు
పర్మినెంట్ క్యాడర్‌పై ప్రతిపాదన
అదేవిధంగా ప్రాజెక్టు అథారిటీ కార్యనిర్వహణ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్టులో ఉన్న విధానాన్ని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకు కూడా పర్మినెంట్ క్యాడర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించనున్నారు.
ఈ ప్రతిపాదనపై చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.