Loading...
FIR on Pellet Gun Case:పెల్లెట్ గన్ కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్.. కీలక ఆధారాలు సమర్పించిన బాధితుడు 
కీలక ఆధారాలు సమర్పించిన బాధితుడు

FIR on Pellet Gun Case:పెల్లెట్ గన్ కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్.. కీలక ఆధారాలు సమర్పించిన బాధితుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ పెల్లెట్ గన్ ఘటనపై ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేయడం సాధ్యం కాదని తొలుత చెప్పిన పోలీసులు.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితుడు సాహిల్ లొచాబ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో వెనక్కి తగ్గారు. సాహిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పెల్లెట్ గన్ దాడికి సంబంధించిన వైద్య నివేదికలు, ఇతర కీలక పత్రాలను సేకరించారు.

వివరాలు 

ఛలో పార్లమెంట్‌లో పెల్లెట్ గన్స్ ప్రయోగం

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జూలై 20న 'ఛలో పార్లమెంట్'కు పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

ఈ ఘటనలో 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లొచాబ్ తీవ్రంగా గాయపడ్డాడు.

పెల్లెట్ గన్ దాడిలో అతడి ఒక కంటికి తీవ్ర గాయమవడంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో గాయాలయ్యాయి. దీంతో పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

బాధితుడి తరఫున రాహుల్ పోరాటం

పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బాధితుడు సాహిల్ లొచాబ్‌కు మద్దతుగా నిలిచారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాహిల్‌తో కలిసి ఢిల్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గలేదు.

కేసు నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించారు.

దీంతో చివరకు పోలీసులు దిగొచ్చి సాహిల్ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

వైద్య నివేదికలు, ఇతర పత్రాల స్వీకరణ

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం పోలీసులు సాహిల్ లొచాబ్ నుంచి పెల్లెట్ గన్ గాయాలకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, ఇతర డాక్యుమెంట్లను తీసుకున్నారు.

ఈ పత్రాలను కేసులో కీలక ఆధారాలుగా పరిగణించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలై 

పెల్లెట్ గన్స్‌పై రాహుల్ ఆగ్రహం

పెల్లెట్ గన్స్‌ను గతంలో 2010లో కశ్మీర్‌లో నిరసనకారులపై ఉపయోగించిన విషయం తెలిసిందే.

అలాంటి ఆయుధాలను విద్యార్థులపై ప్రయోగించడంపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన తప్పుపట్టారు.

పెల్లెట్ గన్స్ ఉపయోగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

బాధితుడికి న్యాయం జరిగేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన డిమాండ్‌పై చివరి వరకు పట్టువీడలేదు.

దీంతో ఆయన బైఠాయింపు అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడం ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా మారింది.

ADVERTISEMENT