LOADING...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు

వ్రాసిన వారు Stalin
Aug 09, 2023
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పుంగనూరు అల్లర్ల నేపథ్యంలో ఈ కేసును పోలీసులు నమోదు చేసారు. ఇందులో ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్లను చేర్చారు. ప్రాజెక్టులను సందర్శిస్తున్నామన్న పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని పోలీసులు అభియోగాలు మోపారు. ఇదే ఘటనలో చంద్రబాబుపై తంబళ్లపల్లి, కురుబలాకోట పోలీసులు ఐపీసీ 307 కింద హత్యయత్నం కేసు నమోదు చేశారు. గతవారం పుంగనూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో అల్లర్లు చెలరేగగా, దాదాపు 50మంది పోలీసులకు గాయాలైన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ