తదుపరి వార్తా కథనం
AP High court: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 12, 2025
03:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
సీఐడీ సమర్పించిన పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఇప్పటికే పీటీ వారెంట్ ఆధారంగా పోసానిని కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టుకు నివేదించారు.
మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు పోసానిని హాజరుపరచేందుకు కర్నూలు నుంచి తీసుకువస్తున్న విషయాన్ని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు పరిశీలించిన ధర్మాసనం, పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసింది.