Loading...
Mohan Bhagwat: భారత్ అభివృద్ధిని శక్తిమంతమైన దేశాలు కోరుకోవడం లేదు: మోహన్ భగవత్
భారత్ అభివృద్ధిని శక్తిమంతమైన దేశాలు కోరుకోవడం లేదు: మోహన్ భగవత్

Mohan Bhagwat: భారత్ అభివృద్ధిని శక్తిమంతమైన దేశాలు కోరుకోవడం లేదు: మోహన్ భగవత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని ఏ శక్తిమంతమైన దేశం కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరెస్సెస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 'బలవంతుడిదే పైచేయి' అనే సిద్ధాంతాన్ని నమ్మే అగ్రదేశాలు ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశాలను నిరంతరం ఒత్తిడిలో ఉంచడం ద్వారా తమ ప్రాబల్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జ్ఞానయజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదో 'పద్మ ఫెస్టివల్' ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందితే తమ దేశాల్లోని వ్యాపారాలు, సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన శక్తిమంతమైన దేశాల్లో ఉందని మోహన్ భగవత్ అన్నారు.

వివరాలు 

మాల్దీవులు, శ్రీలంక, పాకిస్థాన్‌లకు గతంలో చేసిన సహాయాన్ని గుర్తుచేసిన మోహన్ భాగవత్

అయితే భారత్ మాత్రం ఇతర దేశాలకు సాయం చేయాలనే వైఖరితో ముందుకు సాగుతోందని చెప్పారు.

చివరకు భారత్‌ను ద్వేషించే పొరుగు దేశాలకు కూడా కష్టకాలంలో అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

సంక్షోభ సమయంలో మాల్దీవులకు తాగునీరు అందించడం,ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న శ్రీలంకకు సహాయం చేయడం,నేపాల్,బంగ్లాదేశ్‌లకు అవసరమైన సమయంలో తోడ్పాటు అందించడం వంటి ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

మాల్దీవులు, శ్రీలంక, పాకిస్థాన్‌లకు గతంలో చేసిన సహాయాన్ని గుర్తుచేసిన మోహన్ భాగవత్

అంతేకాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పాకిస్థాన్‌కు సైతం భారత్ మానవతా దృక్పథంతో సహాయం చేసిందని వివరించారు.

ప్రస్తుత యువతలో ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

నేటి తరం బానిసత్వపు ఆలోచనల నుంచి బయటపడిందని, అబద్ధాలను ఏమాత్రం సహించకుండా దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్ ఎదిగితే ఇతర దేశాల వ్యాపారాలకు ఇబ్బందులు: మోహన్ భగవత్

ADVERTISEMENT