Page Loader
Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు 
Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు

Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2023
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. 44ఏళ్ల పూజారి గురువారం రామజన్మభూమి ప్రాంగణంలోని హై-సెక్యూరిటీ జోన్‌లోని ఒక గదిలో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరో తెలిసిన వారు అతన్ని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నయ్యర్ మాట్లాడుతూ దాస్ హనుమాన్‌గర్హి ఆలయానికి ప్రక్కనే ఉన్న గదిలో ఇద్దరు శిష్యులతో కలిసి ఉండేవారన్నారు. శిష్యులిద్దరిని కీలక అనుమానితులుగా భావిస్తున్నారు. అనుమానితుల్లో ఒకరిని విచారిస్తున్నామని,రెండో వ్యక్తి తప్పించుకొనిపోయాడని ఆయన తెలిపారు. రెండో నిందితుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు నయ్యర్ తెలిపారు.

Details 

 పదునైన ఆయుధంతో పూజారి హత్య 

గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం అందిందని నయ్యర్ తెలిపారు. ఉదయం ప్రార్థనలకు రాకపోవడంతో అనుమానంతో వెతకగా గొంతు కోసిన దాస్ మృతదేహం కనిపించింది. హనుమాన్‌గర్హి దేవాలయంలోని పూజారులలో దాస్ ఒకరని నయ్యర్ చెప్పారు. దాస్ ను పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు నయ్యర్ చెప్పారు. హత్య చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని ఆయన తెలిపారు. హత్య వెనుక ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, బుధవారం రాత్రి దాస్ తన శిష్యులతో కొంత ఘర్షణ పడ్డాడని నయ్యర్ చెప్పారు.