Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా పవన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ పర్యటనపై పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
వివరాలు
జనసేన తరుపున మోదీకి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్
ఆయన తన పోస్టులో 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం తెలంగాణకు విచ్చేస్తున్న ప్రధానికి ఘన స్వాగతం తెలిపారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, యువతకు కొత్త అవకాశాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ అభివృద్ధిపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.