Page Loader
PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ 
PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ

PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Mar 01, 2024
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సందేశ్‌ఖాలీ కేసు'పై ప్రధాని మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆరంబాగ్‌లో శుక్రవారం జరిగిన బహిహరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విషయంలో మమతా బెనర్జీ సర్కార్‌ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. సందేశ్‌ఖాలీ మహిళలకు టీఎంసీ చేసిన అన్యాయం వల్ల దేశం మొత్తం ఆగ్రహంతో ఉన్నదన్నారు. బెంగాల్ పరిస్థితిని దేశం మొత్తం గమనిస్తోందని అన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్‌ అన్ని హద్దులను అధిగమించాడని అన్నారు. ఈ సందర్భంగా రాజా రామ్‌మోహన్‌రాయ్‌ గురించి ప్రస్తావించారు. సందేశ్‌ఖాలీలో జరిగిన సంఘటన చూసి.. రాజా రామ్‌మోహన్‌రాయ్‌ ఆత్మను దుఃఖిస్తుందన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఇక్కడి మహిళల గౌరవం కోసం పోరాడారాని కితాబిచ్చారు.

మోదీ

అవినీతిపరులకు మద్దతు ఇస్తున్న ఇండియా కూటమి: ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా కూటమిని కూడా టార్గెట్ చేశారు. సందేశ్‌ఖలీ ఘటనపై ఇండియా కూటమిలోని పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అవినీతిపరులు, రాజవంశీకులకు మద్దతుదారుగా ఇండియా కూటమిని అభివర్ణించారు. 'అవినీతిపరులను రక్షించేందుకు బెంగాల్ సీఎం సమ్మెకు కూర్చున్నారని ప్రధాని నిప్పులు చెరిగారు. సందేశ్‌ఖలీలోని సోదరీమణులు సాయం కోరినప్పుడు మమతా దీదీ ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించి షేక్‌ను రక్షించిందన్నారు. గత నెలలో సందేశ్‌ఖాలీకి చెందిన పలువురు మహిళలు టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నెల రోజుల నిరసన తర్వాత, షేక్‌ను ఫిబ్రవరి 29న పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత షాజహాన్ షేక్‌ను పార్టీ నుంచి టీఎంసీ 6ఏళ్ల పాటు బహిష్కరించింది.