LOADING...
Bus Fire Accident: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం

Bus Fire Accident: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌, క్లీనర్‌ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ, బస్సులోని ప్రయాణికుల లగేజీ మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement