Page Loader
Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ 
గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ 

వ్రాసిన వారు Stalin
Oct 28, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం విమర్శలు గుప్పించారు. దామోహ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ గత మూడేళ్లలో కేవలం 21 ఉద్యోగాలు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో యువతకు డిగ్రీలు ఉన్నాయి కానీ ఉపాధి లేదని అన్నారు. నేడు దేశంలో నిరుద్యోగం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందని ప్రియాంక అన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత మూడేళ్లలో 21 ఉద్యోగాలు కల్పించడం విచారకరమన్నారు. గత 18ఏళ్లలో ఇంతదారుణంగా ఎప్పుడూ లేదన్నారు.

కాంగ్రెస్

ప్రభుత్వ రంగ సంస్థలను స్నేహితులకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ: ప్రియాంక

ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం తమ స్నేహితులపై పారిశ్రామికవేత్తలకు అప్పగించిందని ప్రియాంక గాంధీ అన్నారు. రాష్ట్రంలో యువత చదువుకున్నారు, డిగ్రీలు సంపాదించారు కానీ, రిక్రూట్‌మెంట్‌లు లేవన్నారు. మహిళా రిజర్వేషన్లకు కల్పించినట్లు మోదీ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోందని, కానీ అవి 2029 వరకు అమలు కావన్నారు. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. శివరాజ్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కాంగ్రెస్, మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.