Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కీలక రోల్.. అస్సాం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ ఏడాది అస్సాంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అక్కడి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియాంక గాంధీ నేతృత్వంలోని ఈ స్క్రీనింగ్ కమిటీలో లోక్‌సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్‌ను సభ్యులుగా నియమించారు. అస్సాం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, టికెట్ల ఖరారు, ఎన్నికలకు ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు, సమన్వయ కార్యక్రమాలన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
Details
బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడమే లక్ష్యం
ఎన్నికల వ్యూహరచనలో స్క్రీనింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.