LOADING...
Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

వ్రాసిన వారు Stalin
Mar 01, 2024
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపి శుక్రవారం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. శ్రీ గోయింద్వాల్ సాహిబ్ సమీపంలోని ఫతేహాబాద్ రైల్వే గేట్ వద్ద ఉదయం 8:00 గంటలకు ఈ సంఘటన జరిగింది. రైల్వే గేటు మూసి ఉండడంతో కారులో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి గురుప్రీత్‌ను హతమార్చారు. ఖాదూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్‌పురాకు గురుప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితుడు. సుల్తాన్‌పూర్ లోధి కోర్టులో విచారణకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పులు జరిపిన దృశ్యాలు