బజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చినందుకు ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్ నివాసి హితేష్ భరద్వాజ్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై ఈ సమన్లు జారీ చేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో ఖర్గే భజరంగ్ దళ్ సంస్థను పీఎఫ్‌ఐతో పోల్చారని ఖర్గేపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్‌దళ్‌ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు గాను ఖర్గేపై హితేష్ భరద్వాజ్ రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. జులై 10న హాజరు కావాలని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రమణదీప్ కౌర్ కోర్టు ఖర్గేకి సమన్లు జారీ చేసింది.