Loading...
Sanjeevani: మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన వైద్యం.. 'సంజీవని'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన వైద్యం.. 'సంజీవని'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Sanjeevani: మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన వైద్యం.. 'సంజీవని'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 'సంజీవని' కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం అరకులోయ మండలం గన్నెలలో పర్యటించిన సీఎం.. పలు 'ఆరోగ్య రథాలను' జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల ముంగిటకే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వైద్యం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదన్నదే తన సంకల్పమని చెప్పారు.

వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి

ఈ సమస్యను అధిగమించేందుకే 'సంజీవని' కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

వివరాలు

వైద్యంతో పాటు కనెక్టివిటీకి ప్రాధాన్యం

ఆరోగ్య సేవలతోపాటు కనెక్టివిటీకి కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అల్లూరి సేవలను గుర్తుచేసుకున్న సీఎం

గతంలోనే అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంత గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించారని చంద్రబాబు గుర్తుచేశారు.

ఆ మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకే భోగాపురంలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.

అలాగే గిరిజన బిడ్డలు థింసా నృత్యంతో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

ADVERTISEMENT