Page Loader
భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల 
భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల

భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల 

వ్రాసిన వారు Stalin
Sep 05, 2023
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు. ముఖ్యంగా పిల్లల విషయంలోచాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలను బయటకు వెళ్లనివ్వొద్దని సూచించారు. మురుగు కాలువలు, మ్యాన్ హోల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటి దరిదాపుల్లోకి పిల్లలను కూడా వెళ్లనివ్వవద్దని చెప్పారు. విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా వారిని నియంత్రించాలని పోలీసులు వివరించారు. అలాగే శివారు గ్రామాల ప్రజలు చెరువులు, మురుగు కాలువల వద్దకు పిల్లలను పంపొద్దని సూచించారు. పెద్దవారు సైతం అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియోను విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసులు విడుదల చేసిన వీడియో