Page Loader
Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా 
Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా

Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Feb 24, 2024
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. గజినీ లాంటి మనస్తత్వం ఉన్న వారితో తాను పని చేయలేనని రఘురామకృష్ణంరాజు తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. సీఎం జగన్‌ను ఉద్దేశించే రఘురామకృష్ణంరాజు గజినీ అని అన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత మూడేళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. శనివారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా విడదుల కానున్న నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు వైసీపీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాలో ఆయనకు నర్సాపురం లోక్‌సభ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జగన్‌ను రాజీనామా లేఖను పంపిన  రఘురామ కృష్ణంరాజు