Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ
ఢిపెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు. డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్ సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధించారు. దీంతో ఎన్సీపీ ఎంపీ పైజల్ పి.పి మొహమ్మద్ కూడా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కు చోటు
లోక్ సభ బులెటిన్ ప్రకారం కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నాడు. ఇక లోక్ సభకు కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సుశీల్ కుమార్ రింకూ వ్యవసాయం, పశుపోషణ, ఆహార ప్రాసెసింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై గుజరాత్ కోర్టు రాహుల్ ను దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.