Loading...
Rahul Gandhi: ఓట్ల చోరీపై రాష్ట్రపతికి ఆధారాలు ఇచ్చాం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓట్ల చోరీపై రాష్ట్రపతికి ఆధారాలు ఇచ్చాం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi: ఓట్ల చోరీపై రాష్ట్రపతికి ఆధారాలు ఇచ్చాం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
09:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ ధ్వంసం చేస్తున్నారని ఇండీ కూటమి నేతలు ఆరోపించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) అంశంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ పెద్ద తప్పు చేశారని విమర్శించారు. రాష్ట్రపతితో సమావేశమైన అనంతరం ఇండీ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓట్ల చోరీ అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు రాహుల్‌ గాంధీ వెల్లడించారు.

వివరాలు 

ఓట్ల చోరీకి ఆధారాలు అందజేశాం

ఓట్ల చోరీ ఎక్కడెక్కడ జరిగిందనే అంశంపై రాష్ట్రపతి ఆధారాలు అడిగారని రాహుల్‌ గాంధీ తెలిపారు.

అందుకు సంబంధించిన ఆధారాలను ఆమెకు అందజేసినట్లు చెప్పారు.

ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాల ద్వారానే నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందనే విషయం ప్రజలందరికీ తెలుసని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచే ఓట్ల చోరీకి సంబంధించిన వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రధాని మోదీ, అమిత్‌షా, సీఈసీపై విమర్శలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

ADVERTISEMENT