RRB ALP Recruitment 2026: టెన్త్ అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 22,000 గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు పూర్తయ్యాయి. ఇప్పుడు రైల్వే నిరుద్యోగులకు మరో మంచి అవకాశాన్ని అందిస్తోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 మే 15 నుండి ప్రారంభమై జూన్ 14, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. అర్హత పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
అర్హతలు ఇవే..
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి లేదా ITI పూర్తి చేసి ఉండాలి. లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి. వయసు: కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు. OBC కోసం 3 సంవత్సరాల వయో సడలింపు SC/ST కోసం 5 సంవత్సరాల వయో సడలింపు రిజర్వ్డ్ కేటగిరీలు, మాజీ సైనికులు కూడా వయసు సడలింపుకు అర్హులు.
వివరాలు
ఎంపిక ప్రక్రియ ఇలా..
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం ఎంపిక దశలవారీగా జరుగుతుంది. CBT 1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) CBT 2 (సోఫ్ట్ స్కిల్/అడ్వాన్స్‌డ్ పరీక్ష) CBAT (కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్) DV (డాక్యుమెంట్ వెరిఫికేషన్) ME (మెడికల్ ఎగ్జామినేషన్) దరఖాస్తు రుసుము: సాధారణ అభ్యర్థులు: ₹500 SC/ST, మాజీ సైనికులు, ట్రాన్స్‌జెండర్, EBC అభ్యర్థులు: ₹250