Loading...
APSDMA: నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్
నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్

APSDMA: నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఏపీఎస్‌డీఎంఏ తాజా అంచనాల ప్రకారం శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వివరాలు 

పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అదే సమయంలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది.

ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రకటన బోర్డులు (హోర్డింగ్‌లు) కింద ఆశ్రయం పొందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

పిడుగులు పడే అవకాశమున్న సమయంలో భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచన

ADVERTISEMENT