
తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వానలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాన
తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే బుధవారం సాయంత్రం లేదా రాత్రి చినుకులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాలో ఆకాశం మాత్రం పాక్షికంగా మేఘావృతంమైన ఉంటుంని పేర్కొంది.
వర్షసూచన వల్ల తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గనున్నట్లు తెలిపింది.