Page Loader
AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు 
ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు

AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఎండీ సూచనల ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. దీనితో, రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ అప్రమత్తం చేశారు.

వివరాలు 

మంగళ, బుధ, గురువారాల్లో వానలు 

నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంవరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని ఆయన చెప్పారు. ఐఎండీ ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా కదులుతుందని, తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల, ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడినట్టు సమాచారం అందింది.