LOADING...
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పులు.. మరో 3-4 రోజులు వర్షాలే!
తెలంగాణలో వాతావరణ మార్పులు.. మరో 3-4 రోజులు వర్షాలే!

Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పులు.. మరో 3-4 రోజులు వర్షాలే!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా పడింది. ఈ పరిస్థితులు ఇంకా మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వివరాలు 

పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి

రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. అలాగే నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మార్చి 28న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

వివరాలు 

మార్చి 29 తర్వాత వర్షాల తీవ్రత తగ్గే సూచనలు

మార్చి 29న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మార్చి 30 నుంచి వర్షాల తీవ్రత తగ్గి, తేలికపాటి వర్షాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం ఎలా? హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement