LOADING...
Telangana Rains : తెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో 5 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో 5 రోజులపాటు భారీ వర్షాలు

Telangana Rains : తెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో 5 రోజులపాటు భారీ వర్షాలు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
09:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రకటనలో పేర్కొన్నట్టు, డ్రోణి, గాలి మార్పులు, ఉపరితల చక్రవాతావరణ ప్రభావాలు వలన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వివరాలు 

వడగళ్ల వర్షం కురిసే అవకాశం..

ప్రకటన ప్రకారం, మంగళవారం, బుధవారం రెండు రోజులలో మెరుపులు, ఉరుములు కలిగిన వడగళ్ల వర్షం కురిసే అవకాశముందన్నారు. అదే సమయంలో, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement