Page Loader
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు

తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 16, 2023
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణాది కేరళ నుంచి ఉత్తరాది దిల్లీ వరకు వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతం వాయవ్యంలో 5.8 కిమీ ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం చెందింది. ఫలితంగానే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు : కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది.

DETAILS

ఒక్కరోజే కోటపల్లి మండలంలో 9 సెంటీమీటర్లకుపైగా వర్షం 

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు : ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్., నిర్మల్, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు భారీగా కురవనున్నాయి. పలు ప్రాంతల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నట్లు తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు : ఉమ్మడి జిల్లాలు మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను సైతం వాతావరణ కేంద్రం జారీ చేసింది.మరోవైపు ఇవాళ ఒక్కరోజే మంచిర్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ మేరకు కోటపల్లిలో సుమారు 9 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు.