Page Loader
వరదల్లో చిక్కుకున్న రూ.కోటి విలువ చేసే ఎద్దు; రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
వరదల్లో చిక్కుకున్న నెంబర్‌ వన్‌ ఎద్దు  ప్రీతమ్.. రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

వరదల్లో చిక్కుకున్న రూ.కోటి విలువ చేసే ఎద్దు; రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 15, 2023
07:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వరద నోయిడాను సైతం చుట్టుముట్టింది. వరదల ధాటికి మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో రూ.కోటి విలువైన ఏడేళ్ల ఎద్దు ఒకటి నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. నోయిడాలోని కమలానగర్‌లో గిర్‌ జాతి ఎద్దు ప్రీతమ్‌‌ను వరద ముప్పు నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షించాయి. నడిచే బంగారంగా, దేశంలోనే దీనికి నెంబర్‌ వన్‌ ఎద్దుగా గుర్తింపు ఉంది. దేశంలో ఖరీదైన పశువులు ఎన్ని ఉన్నా, ప్రీతమ్‌ మాత్రం ప్రత్యేకతను సాధించింది. ఈ మేరకు 2019లో తొలిసారిగా జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది. సంకరణ కోసం వీర్యాన్ని ప్రత్యేకంగా విక్రయిస్తారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రక్షించిన ఎద్దు ఫొటోలను ట్వీట్ చేసిన ఎన్‌డీఆర్ఎఫ్