
హరీశ్ రావును కలవడంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజాసింగ్ నేడు మంత్రి హరిశ్ రావుతో బేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
పార్టీ నుండి సస్పెండ్ అయిన రాజాసింగ్ బీజేపీ నేతల నుంచి తనకు పూర్తి స్థాయిలో మద్దతు కరువైందని భావించి ఇక పొలిటికల్ గా తన రూట్ ను మార్చేందుకు బీఆర్ఎస్ లో చేరాలని ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి.
అయితే భారసలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.
Details
బీజేపీలోనే ఉంటా : రాజాసింగ్
నియోజకవర్గంలో ఆస్పత్రి అభివృద్ధి కోసమే హరిశ్ రావును కలిశానని, గోషామహల్‌లో ఉన్న ఆస్పత్రిని 50 పడకలుగా అభివృద్ధి చేయాలని తాను కోరినట్లు రాజాసింగ్ చెప్పారు.
తాను బీజేపీలో ఉంటానని, ఒకవేళ తనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యానం తీసుకుంటానే తప్ప వేరే పార్టీలోకి చేరనని ఆయన స్పష్టం చేశారు
అయితే హిందూ దేశం కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని రాజాసింగ్ వెల్లడించారు.