Page Loader
రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ 
రాజస్థాన్: దిల్లీ-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ

రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ 

వ్రాసిన వారు Stalin
Apr 12, 2023
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు అజ్మీర్ నుంచి జైపూర్ మీదుగా దిల్లీ కాంట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సేవలు ఏప్రిల్ 13న ప్రారంభం కానున్నాయి. జైపూర్, అల్వార్, గుర్గావ్‌ స్టేషన్లను ఈ రైలుకు స్టాప్‌లుగా నిర్ణయించారు. రాజస్థాన్‌లో ప్రారంభమైన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం గమనార్హం.

రాజస్థాన్

60 లక్షల మంది వందే భారత్‌ రైళ్లలో ప్రయాణం

వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. వందే భారత్‌ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 60 లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణించారని ప్రధాని మోదీ చెప్పారు. వందే భారత్ రైలు గొప్పలక్షణం ఏంటంటే ఇది ప్రజల సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. వేగం నుంచి అందమైన డిజైన్ వరకు వందే భారత్ రైలు అనేక విశేషాలను కలిగి ఉందని ఆయన చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాజస్థాన్ పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. గత రెండు నెలల్లో ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం తన అదృష్టం అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోదీ